బీటెక్ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీకోసమే!

  • టీఎస్ జెన్ కో లో 339 ఏఈ పోస్టులు
  • నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ
  • ఈ నెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్ కో తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీటెక్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ నెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సంస్థలో మొత్తం 339 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. అదేవిధంగా, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి బీఎస్సీ (కెమిస్ట్రీ) ఫస్ట్ క్లాస్ లో పాస్, ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్) ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు కూడా రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు గడువు ఈ నెల 29 కాగా డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జెన్ కో తెలిపింది.

ముఖ్యమైన వివరాలు..
పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)
ఖాళీలు: 339
జీతభత్యాలు: రూ.65,600 ప్రారంభ వేతనం, సీనియారిటీ పెరిగేకొద్దీ రూ.1,31,220 
అర్హతలు: బీటెక్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్) ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 44 సంవత్సరాలు (రిజర్వేషన్లకు అనుగుణంగా మినహాయింపులు)
దరఖాస్తులు: అర్హతకల అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించి, ఆన్ లైన్ లో అక్టోబర్ 7 నుంచి దరఖాస్తు చేసుకోవాలి
చివరితేదీ: అక్టోబర్‌ 29
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
రాత పరీక్ష: డిసెంబర్ 3
పూర్తి వివరాల కోసం టీఎస్ జెన్ కో వెబ్ సైట్ ను సంప్రదించాలి


More Telugu News