నగరవాసులకు గుడ్ న్యూస్.. అదనంగా ఆరు కొత్త ఎమ్ఎమ్‌టీఎస్ సర్వీసులు
- మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-హైదరాబాద్ మధ్య కొత్త సర్వీసులు
- ఉమ్దానగర్-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-సికింద్రాబాద్ మధ్య షెడ్యూల్ మార్పులతో అదనపు సర్వీసులు
- ప్రయాణికుల అభిప్రాయాలమేరకు కొత్త సర్వీసులు తెచ్చామన్న దక్షిణ హద్య రైల్వే
నగరవాసులకు దక్షిణమధ్య రైల్వే తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా ఆరు ఎమ్ఎమ్‌టీఎస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్-హైదరాబాద్ స్టేషన్ల మధ్య ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. మేడ్చల్-హైదరాబాద్ మధ్య ఇదే తొలి ఎమ్ఎమ్‌టీఎస్ సర్వీసు కావడం గమనార్హం. నగరానికి ఉత్తరాన ఉన్న ప్రాంతాలకూ ఎమ్ఎమ్‌టీఎస్ సేవలు విస్తరించాలని ఎప్పటినుంచి నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న దక్షిణమధ్య రైల్వే కొత్త సర్వీసులను ప్రకటించింది.
అధికారుల ప్రకటన ప్రకారం, మేడ్చల్-లింగంపల్లి మధ్య ఉదయం, సాయంత్రం వేళల్లో అదనంగా నాలుగు సర్వీసులు, మేడ్చల్-హైదరాబాద్ మధ్య మరో రెండు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, ఉమ్దానగర్-సికింద్రాబాద్, ఫలక్‌నుమా-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు సర్వీసులు అందుబాటులో ఉండేలా షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఇటీవలే హైదరాబాద్-బెంగళూరును అనుసంధానిస్తూ వందే భారత్ రైలు సర్వీసు కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే.