టీడీపీపై మోజు వద్దు.. వైసీపీకి అండగా నిలవండి.. మత్స్యకారులకు ధర్మాన విజ్ఞప్తి

  • శ్రీకాకుళం జిల్లా పెద్దగనగళ్లవానిపేటలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన మంత్రి
  • ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు లేదన్న ధర్మాన
  • ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టయ్యారన్న మంత్రి
టీడీపీపై మోజు వదులుకోవాలని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా పెద్దగనగళ్లవానిపేటలో నిన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై ఎందుకంత మోజని వారిని ప్రశ్నించారు. 

జాలర్లకు తాము అండగా ఉంటున్నామని, వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించామని గుర్తు చేశారు. వారి కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు. కాబట్టి వివక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పోయిందని, ఆ పార్టీ అధ్యక్షుడే అరెస్ట్ అయ్యారని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి వారికి విజ్ఞప్తి చేశారు.


More Telugu News