వరల్డ్ కప్: నెదర్లాండ్స్ పై పాక్ 286 ఆలౌట్
- వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న డచ్ జట్టు
- మరో ఓవర్ మిగిలుండగానే పాక్ ఆలౌట్
- బాస్ డీ లీడ్ కు 4 వికెట్లు
- పాక్ జట్టులో రాణించిన రిజ్వాన్, షకీల్
వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది.
పాక్ జట్టులో మహ్మద్ రిజ్వాన్ 68, సాద్ షకీల్ 68 పరుగులు చేశారు. లోయరార్డర్ లో మహ్మద్ నవాజ్ 39, షాదాబ్ ఖాన్ 32 పరుగులు చేయగా... చివర్లో హరీస్ రవూఫ్ 16, షహీన్ అఫ్రిది 13 (నాటౌట్) పరుగులు నమోదు చేశారు. టాపార్డర్ విఫలమైన ఈ మ్యాచ్ లో మిడిలార్డర్, లోయర్డార్ చలవతోనే పాక్ ఆ మాత్రం పరుగులు చేయగలిగింది.
నెదర్లాండ్స్ బౌలర్ లో బాస్ డీ లీడ్ 4 వికెట్లు తీశాడు. కొలిన్ అకెర్ మన్ 2, ఆర్యన్ దత్ 1, వాన్ బీక్ 1, వాన్ మీకెరెన్ 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం, 287 పరుగుల లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ 5, కొలిన్ అకెర్ మన్ 17 పరుగులు చేసి అవుటయ్యారు. హసన్ అలీ 1, ఇఫ్తికార్ అహ్మద్ 1 వికెట్ తీశారు. విక్రమ జిత్ సింగ్ 24, బాస్ డీ లీడ్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.