టీడీపీ పల్లకీ మోయడానికి పవన్ సిద్ధమయ్యాడు: అంబటి రాంబాబు విసుర్లు
- టీడీపీ బలహీనపడిందని పవన్ చెబుతుంటే, తమకు సింపతీ పెరిగిందని టీడీపీ చెబుతోందని ఎద్దేవా
- ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా జగన్‌కు ఏమీ కాదన్న మంత్రి
- టీడీపీ మునిగిపోయే నావ, ఎవరు లేపినా లేచే పరిస్థితి లేదని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ బలహీనపడిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతుంటే, మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత తమకు సింపతీ పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం చెబుతోందని, ఇందులో ఏది నిజమని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ పల్లకీ మోయడానికి పవన్ కల్యాణ్ సిద్ధమయ్యాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కట్టకట్టుకొని వచ్చినా జగన్‌కు, వైసీపీకి ఏమీ కాదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తాము మళ్లీ గెలిచితీరుతామన్నారు.
తప్పు చేసి జైలుకెళ్లిన ముఖ్యమంత్రులు ఎవరూ రాజకీయంగా బతికిబట్టకట్టలేదని, అధికారంలోకి రాలేదన్నారు. అలా జైలుకు వెళ్లిన మాజీ సీఎంల విషయానికి వస్తే జయలలిత పరిస్థితిని చూశామన్నారు. టీడీపీ మునిగిపోయే నావ అని, మళ్లీ ఎవరు లేపినా లేచే పరిస్థితి లేదన్నారు. అలాంటి టీడీపీకి, చంద్రబాబుకు జనసేన అధినేత మద్దతిస్తున్నారని విమర్శించారు.