ఫిజిక్స్ వాలా లైవ్ క్లాస్‌లో ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన విద్యార్థి.. ఇదిగో వీడియో
- ఫిజిక్స్ వాలా ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య వాగ్వాదం దాడి వరకు వెళ్లిన వైనం
- రెండుమూడుసార్లు చెప్పుతో కొట్టిన విద్యార్థి
- నెట్టింట చక్కర్లు కొడుతోన్న వీడియో
ఆన్ లైన్, సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ ఫిజిక్స్ వాలా లైవ్ క్లాస్‌లో ఓ ఉపాధ్యాయుడిని విద్యార్థి చెప్పుతో కొడుతున్న వీడియో వెలుగు చూసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం ఆ తర్వాత చెప్పుతో దాడి వరకు వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ఉపాధ్యాయుడిపై ఈ దాడి నెటిజన్లను షాకింగ్‌కు గురి చేస్తోంది.
ఈ వీడియో కేవలం తొమ్మిది సెకన్లు మాత్రమే ఉంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఉపాధ్యాయుడిపై విద్యార్థి రెండుమూడుసార్లు చెప్పుతో దాడి చేశాడు. కానీ ఎందుకు ఇలా చేశాడో తెలియరాలేదు. అది మాత్రం మిస్టరీగా మారింది! ఇలా దాడి సరైన పద్ధతి కాదని ఓ నెటిజన్ పేర్కొనగా, డబ్బు కోసం మంచి బిజినెస్ ప్లాన్ చేస్తున్నారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
గతంలో రాజస్థాన్‌లో ఓ సెంటర్ మేనేజర్‌ను ఫిజిక్స్ వాలా ఉద్యోగం నుంచి తొలగించింది. విద్యార్థులకు, మేనేజ్‌మెంట్‌కు మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో వెలుగు చూసింది. ఈ సందర్భంగా కంపెనీ తన అధికారిక ప్రకటనలో, తమ ఫిజిక్స్ వాలాలో విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యత అని, సెంటర్ మేనేజర్‌ను విధుల నుంచి తొలగించామని, ఇది తక్షణమే అమల్లోకి వచ్చిందని పేర్కొంది.