అహ్మదాబాద్‌లో భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో భారతీయ రైల్వే శుభవార్త!
- అక్టోబర్ 5న నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల పోరు
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి ప్రత్యేక వందే భారత్ రైలు
- త్వరలో రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాల వెల్లడి
క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అహ్మదాబాద్‌కు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు భారతీయ రైల్వే ప్రకటించింది.
ఆ రోజున వందే భారత్ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాలను వెల్లడించనున్నామన్నారు. భారత్ - పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటళ్ల ధరలు భారీగా పెరగడం, విమాన టిక్కెట్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.