13 మంది బెయిల్‌పై ఉన్నారని వాదనలు వినిపించాం: చంద్రబాబు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే

  • స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న దూబే   
  • ఈ కేసులో ఎక్కడా చంద్రబాబు పాత్రపై ఆధారాలు లేవన్న న్యాయవాది
  • గుజరాత్‌లో సీమెన్స్ కార్యకలాపాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అన్నారు. చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. సోమవారం తీర్పు ఇవ్వనుంది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన అనంతరం దూబే మాట్లాడుతూ...  ఈ కేసులో ఇప్పటికే పదమూడు మంది బెయిల్‌పై ఉన్నారని తాము న్యాయస్థానంలో వాదనలు వినిపించినట్లు చెప్పారు.

ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎక్కడా, ఎలాంటి ఆధారాలు లేవన్నారు. గుజరాత్‌లో సీమెన్స్ కార్యకలాపాలపై ఇక్కడి అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే చంద్రబాబును విచారించారని, అరెస్టైన పదిహేను రోజుల తర్వాత మళ్లీ కస్టడీ కోరడం సరికాదన్నారు. కాగా చంద్రబాబు తరఫున ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.


More Telugu News