చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో చీకటిని సూచిస్తోంది: నారా భువనేశ్వరి

  • అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలన్న భువనేశ్వరి
  • చీకటిని తరిమి కొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని వ్యాఖ్య
  • కాంతితో క్రాంతి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో ఉన్న చీకటికి నిదర్శనమని ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అన్నారు. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని, కాబట్టి ఆయన అరెస్ట్ రాష్ట్రంలోని చీకటిని సూచిస్తోందన్నారు. అలాంటి చీకటిని తరిమి కొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని, అందుకే కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7, శనివారం రాత్రి ఏడు గంటలకు మన ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దామని పిలుపునిచ్చారు.

కాగా, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఇళ్ళలో లైట్లు ఆపేసి, దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి, వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.


More Telugu News