రేపు రాత్రి 'కాంతితో క్రాంతి' కార్యక్రమానికి నారా లోకేశ్ పిలుపు
- చంద్రబాబుకు సంఘీభావంగా మరో కార్యక్రమానికి టీడీపీ పిలుపు
- రేపు రాత్రి ఇళ్లలో లైట్లు ఆపేద్దామన్న లోకేశ్
- దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలని విన్నపం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇటీవల మోత మోగిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా 'కాంతితో క్రాంతి' కార్యక్రమానికి టీడీపీ యువనేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని లోకేశ్ కోరారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా లోకేశ్ స్పందిస్తూ... ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని మండిపడ్డారు. రేపు సాయంత్రం 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆపి... దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు వెలిగించి, వాహనాల లైట్లను బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని కోరారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయాలని విన్నవించారు. ప్యాలస్ లోని జగనాసురుని కళ్లు బైర్లు కమ్మేలా కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా నిర్వహిద్దామని చెప్పారు.