క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఎయిర్ టెల్ నుంచి రెండు డేటా ప్లాన్లు
- రూ.49, రూ.99 ధరలపై రెండు ప్లాన్లు
- రూ.49 ప్యాక్ లో 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీ
- రూ.99 ప్యాక్ లో అన్ లిమిటెడ్ డేటా
వన్డే ప్రపంచకప్ సమరం ప్రారంభమైంది. గురువారం తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ ను కోట్లాది మంది వీక్షిస్తుంటారు. ముఖ్యంగా ఈ నెల 14న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పట్ల అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. దీంతో, తన కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ రెండు ప్రీపెయిడ్ డేటా ప్యాక్ లను ప్రకటించింది. రూ.49, రూ.99 ప్యాక్ లను తీసుకొచ్చింది.
ఇందులో రూ.49తో రీచార్జ్ చేసుకున్న వారికి 6జీబీ డేటా లభిస్తుంది. ఒక్క రోజుకే ఈ డేటా వ్యాలిడిటీ ఉంటుంది. ఒక మ్యాచ్ చూడాలని అనుకునే వారికి ఇది అనుకూలం. ఇక రూ.99 పెట్టి రీచార్జ్ చేసుకుంటే రెండు రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా పొందొచ్చు. డేటా అయిపోతుందేమోనన్న భయం లేకుండా మ్యాచ్ లను ప్రత్యక్షంగా మొబైల్ లో వీక్షించొచ్చు.
అలాగే, ఎయిర్ టెల్ డీటీహెచ్ సైతం స్టార్ నెట్ వర్క్ సహకారంతో టీవీల్లో క్రికెట్ మ్యాచ్ లను వీక్షించే వారికి ప్రత్యేక ప్లాన్లను ప్రకటించింది. స్టార్ స్పోర్ట్స్ పోర్ట్ ఫోలియో నుంచి ఛానళ్లను యూజర్లు సులభంగా ఎంపిక చేసుకుని చూడొచ్చు.