ఎన్నికల హామీల్లాగే చేసిన ప్రమాణాలనూ మర్చిపోయారా?: మోదీకి ప్రియాంకా గాంధీ సూటి ప్రశ్న
- రాహుల్ గాంధీ రావణుడంటూ బీజేపీ ట్వీట్ పై తీవ్రంగా మండిపడ్డ ప్రియాంక
- రాజకీయాలను ఇంకెంత దిగజార్చుతారంటూ నిలదీసిన కాంగ్రెస్ లీడర్
- బీజేపీ ట్వీట్ సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించిన కేసీ వేణుగోపాల్
రాహుల్ గాంధీ రావణుడంటూ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చేసిన పోస్టుపై ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలను ఇంకెంత దిగజార్చాలని అనుకుంటున్నారంటూ ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను ఆమె ప్రశ్నించారు. ఈమేరకు శుక్రవారం ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
‘గౌరవనీయులైన నరేంద్ర మోదీజీ, జేపీ నడ్డా గారూ.. ఇప్పటికే దిగజారిన రాజకీయాలను మీరు ఇంకెంత దిగజార్చాలని అనుకుంటున్నారు? బీజేపీ అధికారిక ట్విట్టర్ నుంచి రాహుల్ ను కించపరుస్తూ చేసిన పోస్టును మీరు సమర్థిస్తున్నారా? నిజాయతీ, బాధ్యత గల రాజకీయాలు చేస్తామంటూ ఇటీవల ప్రమాణం చేశారు గుర్తుందా? లేక ఎన్నికల హామీల్లాగే చేసిన ప్రమాణాలను కూడా మర్చిపోతున్నారా?’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
ఈ విషయంపై కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. బీజేపీ నేతల తీరు సిగ్గుచేటు. రాహుల్ గాంధీని రావణుడిలా చూపించడం ఆ పార్టీ నేతల స్థాయిని చాటిచెబుతోందని మండిపడ్డారు. రాహుల్ ను అంతం చేయడమే వారి లక్ష్యమని తెలిసిపోతూనే ఉందని ఆరోపించారు. రాహుల్ తన నాయనమ్మను, తన తండ్రిని కోల్పోయారు.. ఇప్పుడు తనకూ సెక్యూరిటీ తగ్గించారు అని కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.