కేవలం నోటి మాటలతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందా?: ప్రధాని మోదీకి కేటీఆర్ చురకలు

  • మహేశ్వరం నియోజకవర్గంలో అత్యాధునిక విజయ మెగా డెయిరీ
  • ప్రారంభించిన కేటీఆర్, తలసాని, సబిత
  • ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమీ ఒరగదన్న కేటీఆర్
  • కేసీఆర్ నాయకత్వంలో అన్ని రకాల రైతులకు న్యాయం జరుగుతోందని వెల్లడి
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద అత్యాధునికంగా నిర్మించిన విజయ మెగా డెయిరీని ఇవాళ తెలంగాణ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలకు బదులిచ్చారు. కేవలం ఊకదంపుడు ప్రసంగాలు, నోటి మాటలతో రైతుల ఆదాయం రెట్టింపు కాదని చురకలు అంటించారు. 

2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని మోదీ 2014లో చెప్పారని, కానీ రైతుల ఆదాయం ఎక్కడైనా డబుల్ అయిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.  తెలంగాణలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో రైతుల కష్టాలు డబుల్ అయ్యాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో పాడిరైతులు, రైతుల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.


More Telugu News