రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వైసీపీ బహిష్కృత నేత
- ఎమ్మెల్యే శంకరరావు ఇసుక తవ్వకాలపై పోరాటం చేసిన కంచేటి సాయి
- గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేయించిన వైనం
- సాయి అరెస్ట్ ను తప్పుపట్టిన హైకోర్టు
పీడీ యాక్ట్ కింద అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన వైసీపీ బహిష్కృత నేత కంచేటి సాయి జైలు నుంచి విడుదల అయ్యారు. పల్నాడు పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కంచేటి సాయి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కక్షపూరితంగా తనపై పీడీ చట్టాన్ని ఉపయోగించి అరెస్ట్ చేశారని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకరరావు ప్రోద్బలంతోనే తనపై కేసులు పెడుతున్నారని తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సాయి అరెస్ట్ ను తప్పుపట్టింది. సాయిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఎమ్మెల్యే శంకరరావు ఇసుక తవ్వకాలపై సాయి పోరాటం చేశారు. దండా నాగేంద్ర అనే వ్యక్తి ద్వారా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేయించారు. ఈ క్రమంలోనే ఆయనపై కేసులు నమోదయ్యాయి.