తెలంగాణలో రెండేళ్లలో 22 లక్షల ఓట్ల తొలగింపు

  • వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌ కుమార్
  • మూడ్రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్న 
    కేంద్ర ఎన్నికల బృందం
  • అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమైన బృందం
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో నోటిషికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. మూడు రోజుల పర్యటన నేటితో ముగియనుంది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర అధికారులు, పోలీసులు, ఇతర అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. మరోవైపు రాష్ట్రంలో ఓటర్ల జాబితా నిన్న వెల్లడైంది. తాము అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగవచ్చని కొన్ని పార్టీలు అందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 22 లక్షలకు పైగా ఓట్లను పరిశీలించి తొలగించామని ఆయన వెల్లడించారు. సమాజంలోని అన్ని వర్గాలను ఓటింగ్‌లో భాగస్వామ్యం చేస్తున్నామని ఆయన తెలిపారు.


More Telugu News