స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఏముంది?: ఏసీబీ కోర్టులో న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే
- చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన ప్రమోద్ కుమార్ దూబే
- రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారన్న న్యాయవాది
- సీఎం హోదాలో చంద్రబాబు నిధులు మాత్రమే మంజూరు చేశారని వెల్లడి
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అన్నారు. ఏసీబీ న్యాయస్థానంలో టీడీపీ అధినేత తరఫున ఆయన వాదనలను వినిపించారు. ఈ కేసు నమోదు చేసిన రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఆయనను కేసులో ఇరికించారన్నారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో నిధులు మాత్రమే మంజూరు చేసినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం 40 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారని, ఇందులో చంద్రబాబు పాత్ర ఏముంది? అన్నారు. ఈ కేసుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను లంచ్ విరామం తర్వాతకు వాయిదా వేశారు.