ఎలాన్ మస్క్‌పై కోర్టుకెక్కిన మాజీ గర్ల్ ఫ్రెండ్
- ఎలాన్ మస్క్, గ్రిమ్స్‌కు ముగ్గురు సంతానం
- మూడేళ్ల పాటు కలిసున్నాక విడిపోయిన జంట
- కడుపున పుట్టిన బిడ్డల్ని చూసుకోనివ్వట్లేదంటూ మస్క్‌పై గ్రిమ్స్ పిటిషన్
- తమకు పెళ్లి కాలేదు కాబట్టి తమ బిడ్డలకు చట్టబద్ధంగా పేరెంట్స్ ఎవరో తేల్చాలని విజ్ఞప్తి
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌పై ఆయన మాజీ సహచరి గ్రిమ్స్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. కడుపున పుట్టిన పిల్లల్ని కలుసుకునేందుకు తనకు మస్క్ అవకాశం ఇవ్వట్లేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. మస్క్, గ్రిమ్స్ మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. వారికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
అయితే, తామిద్దరికీ పెళ్లి కాలేదు కాబట్టి తమ సంతానానికి చట్టపరంగా తల్లిదండ్రులను కోర్టే నిర్ణయించాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
గ్రిమ్స్, మస్క్‌కు 2020లో ఓ బాబు జన్మించాడు. మరుసటి ఏడాది ఓ కూతురు పుట్టింది. సరోగసీ ద్వారా ఈ బిడ్డకు ఆమె తల్లయ్యారు. అయితే, వారికి మూడో సంతానం కూడా ఉందని వాల్టర్ ఐసాస్కసన్ అనే జర్నలిస్టు గతంలో పేర్కొన్నారు. ఎలాన్ మస్క్‌పై తాను రాసిన జీవిత చరిత్రలో ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా, తనకు పిల్లల్ని చూసే అవకాశం కల్పించాలంటూ గ్రిమ్స్ కొన్ని వారాల క్రితమే మస్క్‌ను సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు.