ఆసియా క్రీడలు: జావెలిన్ త్రోలో పసిడి సాధించిన నీరజ్ చోప్రా

  • ఇప్పటి వరకు 81 పతకాలు గెలిచిన భారత్
  • 18 పసిడి, 31 రజత, 32 కాంస్య పతకాలు సాధించిన భారత్
  • జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన కిషోర్ కుమార్ జెనా
ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్‌లో భారత్ వరుసగా పతకాలను వశం చేసుకుంటోంది. భారత్ ఇప్పటి వరకు 81 పతకాలను సాధించింది. ఇందులో 18 బంగారు, 31 రజత, 32 కాంస్య పతకాలు గెలుచుకుంది. తాజాగా మెన్స్ 4×400 మీటర్స్ రిలేలో భారత్ బంగారు పతకం సాధించడంతో పసిడి పతకాల సంఖ్య 18కి చేరుకుంది. ఉమెన్స్ 4×400 మీటర్స్ రిలేలోనూ భారత్‌కు రజతం దక్కింది. 35 కి.మీ. రేసు వాక్‌ మిక్స్‌డ్‌ టీమ్స్‌ ఫైనల్‌లో భారత్‌ కాంస్యం గెలుచుకుంది.

అంతకుముందు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించారు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రజత పతకం నెగ్గారు.


More Telugu News