విద్యా సంస్థలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- దీపావళికి ఒక్క రోజే సెలవు
- క్రిస్మస్‌కు మిషనరీ స్కూళ్లకు ఐదు రోజులు.. మిగతా స్కూళ్లకు ఒక్కరోజే మంజూరు
- సంక్రాంతికి ఆరు రోజులు సెలవు ప్రకటన
ఈ మధ్యే దసరా, బతుకమ్మ పండగల సెలవులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి సెలవులపై కూడా ప్రకటన చేసింది. దీపావళి పండగకు ఒక్క రోజు మాత్రమే సెలవు ఇచ్చింది. డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండగకు ఐదు రోజులు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఐదు రోజుల పాటు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉంటాయని తెలిపింది. ఇతర స్కూళ్లకు మాత్రం క్రిస్మస్ నాడు (డిసెంబర్ 25) మాత్రమే సెలవు ఇచ్చింది.
ఈ విద్యా సంవత్సరంలో వచ్చే మరో పెద్ద పండగ సంక్రాంతికి ఆరు రోజులు సెలవు ప్రకటించింది. భోగి, సంక్రాంతి, కనుమ పండగలతో మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఖరారు చేసింది. కాగా, దసరా, బతుకమ్మ కోసం అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పాఠశాలలకు 13 రోజుల సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.