శత్రువుల కోసం వల పన్ని సొంత నావికులను కోల్పోయిన చైనా.. 55 మంది మృతి!

  • ట్రాప్ లో చిక్కుకున్న చైనా సబ్ మెరైన్.. సిబ్బంది మొత్తం దుర్మరణం
  • ఆగస్టులో ఈ ఘటన చోటుచేసుకుందంటూ యూకే ఇంటెలిజెన్స్ నివేదిక
  • ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టి పారేసిన చైనా ప్రభుత్వం
శత్రు నౌకలను, సబ్ మెరైన్ లను అడ్డుకోవడానికి చైనా అమర్చిన ట్రాప్ సొంత నావికులనే బలి తీసుకుంది.. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 55 మంది దుర్మరణానికి కారణమైంది. చైన్ అండ్ యాంకర్ ట్రాప్ కు చిక్కుకోవడంతో చైనా సబ్ మెరైన్ లోని సిబ్బంది మొత్తం బలయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో యెల్లో సీలో ఈ ఘటన చోటుచేసుకుందని యునైటెడ్ నేషన్స్ ఇంటెలిజెన్స్ శాఖ ఓ నివేదిక వెల్లడించింది. అయితే, ఈ వార్తలను చైనా కొట్టిపారేసింది. అలాంటి ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.

యూకే వెల్లడించిన నివేదిక ప్రకారం.. యెల్లో సముద్రంలో ఆగస్టు 21న ఉదయం 8:12 గంటలకు (స్థానిక కాలమానం) ట్రాప్ లో చిక్కుకుంది. దీని ప్రభావంతో సబ్ మెరైన్ సిస్టం ఫెయిలైంది. మరమ్మతులు చేసి సబ్ మెరైన్ ను ఉపరితలానికి తీసుకురావడానికి సుమారు ఆరు గంటలు పట్టింది. అప్పటికే లోపల ఉన్న 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ కాడెట్లు, 9 మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది సెయిలర్లు అందరూ విగతజీవులుగా మారిపోయారు. ఆక్సీజన్ సరఫరా వ్యవస్థ మాల్ ఫంక్షన్ కారణంగా వారంతా చనిపోయారు. చైనా ప్రభుత్వం మాత్రం ఈ రిపోర్టును అధికారికంగా ఖండించింది.


More Telugu News