ఆసియా క్రీడల్లో స్వర్ణభేరి మోగించిన విజయవాడ అమ్మాయి

  • ఆర్చరీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బంగారు పతకం సొంతం
  • ఫైనల్లో దక్షిణ కొరియా జంటపై విజయం
  • 71 పతకాలకు చేరుకున్న భారత్
ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ప్రతీ రోజూ పతకాల మోత మోగిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్చర్, విజయవాడకు చెందిన వెన్న జ్యోతి సురేఖ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆర్చ‌రీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఓజాస్ దియోత‌లేతో కలిసి బంగారు పతకం గెలిచింది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన ద‌క్షిణ‌ కొరియా ఆట‌గాళ్ల‌ను ఓడించారు. ఫైన‌ల్లో సురేఖ–ఓజాస్ 159-158 స్కోరుతో సో చ‌యివాన్‌– జూ జ‌హివూన్ పై ఉత్కంఠ విజయం సాధించారు. ఆసియా క్రీడ‌ల్లో భార‌త ప‌త‌కాల సంఖ్య 71కు చేరుకుంది. ఆసియా క్రీడల్లో అత్యధిక పతకాల రికార్డును భారత్ అధిగమించింది. 2018లో జరిగిన గత ఎడిషన్‌లో భారత్ 70 పతకాలు సాధించింది.


More Telugu News