అన్ని నగరాల్లో 33 శాతం.. ఒక్క హైదరాబాద్‌లోనే 261 శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం
- సిటీకి క్యూ కడుతున్న ప్రపంచ ప్రముఖ సంస్థలు
- ఆఫీస్ స్పేస్‌కు భారీగా పెరిగిన డిమాండ్
భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు, తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నాయి. దాంతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారుతోంది. ఈ క్రమంలో నగరంలో ఆఫీస్ స్పేస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. 2023 మూడవ త్రైమాసికంలో దేశంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 33 శాతం పెరిగింది. అయితే, హైదరాబాద్‌లో ఏడాదికి ఏకంగా 261 శాతం పెరిగింది. ఇలా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన నగరంగా హైదరాబాద్ రికార్డు సృష్టించింది.
రియల్టీ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ తాజా నివేదిక ప్రకారం, నగరంలో ఏడాది కాలంలో 3.1 మిలియన్ చదరపు అడుగులు ఆఫీస్ స్పేస్ ను ప్రముఖ కార్పొరేట్ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఓవరాల్ ఆఫీస్ స్పేస్ లీజులో ముంబై (3.3 మిలియన్ ఎస్ఎఫ్టీ), బెంగళూరు (3.2 మిలియన్ ఎస్ఎఫ్టీ) తర్వాత హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు నగరాలు త్రైమాసికంలో మొత్తం లీజింగ్ లావాదేవీల్లో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వీటిలో హైదరాబాద్, బెంగళూరులో బడా కంపెనీలతో భారీ మొత్తం స్పేస్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.