వందే భారత్ స్లీపర్ వెర్షన్ చిత్రాలను షేర్ చేసిన రైల్వే మంత్రి.. ఫోటోలు ఇవిగో

  • స్లీపర్ కోచ్ ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • అద్భుతమైన ఇంటీరియర్‌తో ఆకర్షణీయంగా ఉన్న కోచ్
  • విశాలంగా, లగ్జరీగా స్లీపర్ బెర్తులు
దేశవ్యాప్తంగా పరుగులు పెడుతున్న వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లకు స్లీపర్ కోచ్‌ రైళ్లు కూడా జతకాబోతున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు భారతీయ రైల్వే ఇటీవల ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబరు నాటికి స్లీపర్ ఎడిషన్ వందేభారత్ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని, మార్చి 2024 నాటికి రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 
   తాజాగా, స్లీపర్ రైలుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. అత్యద్భుతంగా ఉన్న ఈ కోచ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విశాలంగా, లగ్జరీగా ఉన్న ఈ కోచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. రాత్రిపూట ప్రయాణించే వారికి అత్యంత సౌకర్యంగా ఉండేలా బెర్త్‌లను తీర్చిదిద్దారు. వచ్చే ఏడాది మార్చిలో పట్టాలపైకి రాబోతున్న స్లీపర్ కోచ్ రైలులో మొత్తం 857 బెర్త్‌లు ఉంటాయి. వీటిలో ప్రయాణికుల కోసం 823, సిబ్బంది కోసం 34 అందుబాటులో ఉంటాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని నిర్మిస్తున్నారు.   


More Telugu News