ఆసియా క్రీడల్లో అన్ను రాణి సూపర్ త్రో... భారత్ ఖాతాలో జావెలిన్ స్వర్ణం
- చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు
- జావెలిన్ ను 62.92 మీటర్లు విసిరిన పసిడి పతకం సాధించిన అన్ను రాణి
- భారత్ ఖాతాలో 15వ స్వర్ణం
భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది.
ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ త్రో విసిరింది.
61.57 మీటర్లతో శ్రీలంక క్రీడాకారిణి నదీష దిల్హాన్ రజతం గెలుచుకుంది. చైనాకు చెందిన హుయిహుయి ల్యూ 61.29 మీటర్లతో కాంస్యం దక్కించుకుంది. కాగా, అన్ను రాణి గెలుచుకున్న స్వర్ణంతో, ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పతకాల సంఖ్య 15కి పెరిగింది.