నేను శ్రీదేవిని రెండుసార్లు పెళ్లి చేసుకున్నాను... అందుకే జాన్వీ పుట్టినరోజుపై గందరగోళం: బోనీ కపూర్

  • జాన్వీ కపూర్ పుట్టినరోజుపై మీడియాలో ప్రచారం
  • బోనీ, శ్రీదేవిలకు పెళ్లికి ముందే పుట్టిందంటూ కథనాలు
  • శ్రీదేవిని రెండుసార్లు పెళ్లాడడం వల్ల గందరగోళం నెలకొందన్న బోనీ
  • 1996లో మొదట రహస్యంగా పెళ్లాడానని వెల్లడి
  • 1997 జనవరిలో అందరికీ తెలిసేలా పెళ్లాడానని వివరణ
  • 1997 మార్చిలో జాన్వీ పుట్టిందని స్పష్టీకరణ
తన కుమార్తె జాన్వీ కపూర్ పుట్టినరోజు విషయంలో జరుగుతున్న ప్రచారంపై నిర్మాత బోనీకపూర్ మరోసారి వివరణ ఇచ్చారు. శ్రీదేవిని తాను రెండుసార్లు పెళ్లి చేసుకోవడం వల్ల కొంచెం గందరగోళం నెలకొందని, అంతేతప్ప తమ పెళ్లికి ముందే జాన్వీ కపూర్ పుట్టిందనడం సరికాదని అన్నారు. జాన్వీ కపూర్ పుట్టినరోజుపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా, ఈ తరహా ప్రచారం మాత్రం ఆగడంలేదని విచారం వ్యక్తం చేశారు. 

వాస్తవానికి శ్రీదేవిని తాను మొదట 1996లో పెళ్లాడానని బోనీకపూర్ స్పష్టం చేశారు. ఆ పెళ్లి షిర్డీలో జరిగిందని తెలిపారు. షిర్డీలో రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయాన్ని కొన్ని నెలల తర్వాత మీడియా ఎదుట ప్రకటించామని వెల్లడించారు. ఆ తర్వాత 1997 జనవరిలో శ్రీదేవిని మరోసారి పెళ్లి చేసుకున్నానని, ఈ పెళ్లి అందరికీ తెలిసే జరిగిందని బోనీ వివరించారు. 

ఇక, 1997 మార్చిలో జాన్వీ పుట్టిందని తెలిపారు. 1996లోనే తమ పెళ్లి జరిగిందని, తమ పెళ్లి జరిగిన తర్వాతే జాన్వీ పుట్టిందన్న విషయాన్ని మీడియా ఇకనైనా గుర్తించాలని హితవు పలికారు.


More Telugu News