ఓటీటీలో ఈ వారం సినిమా: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
- తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్
- హెబ్బా పటేల్ కీలక పాత్రలో సినిమా
- విప్లవ్ కోనేటి దర్శకత్వంలో వస్తోన్న ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
ఓటీటీలో ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే చిత్రాల్లో ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ ఉంది. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిన ఈ తెలుగు చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకుడు. హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటించింది. నరేశ్ వీకే, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు.
చనిపోయిన వ్యక్తిని బతికించుకునేందుకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఎంచుకున్న మార్గం... వారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? అనే అంశాల ఆధారంగా ఈ సినిమాను తీశారు. 'బళ్లారి నీలకంఠం గారు మా పెదనాన్న.. ఈ విధిని, డెస్టినీని మార్చలేమా అనుకుంటూ ఆయన చావుకు కారణం వెతుకుతుంటే, అనుకోకుండా వారిని బతికించుకునే దారి కనిపించింది. ఆయన కోసం ఆయన ప్రేమించే వాళ్లు, బలంగా కోరుకొని ప్రాణత్యాగం చేస్తే మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందట' అని హెబ్బా పటేల్ కొట్టే డైలాగ్‌కు చెందిన ట్రైలర్ విడుదలైంది.