నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో కంపించిన భూమి

  • రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో నేపాల్‌లో భూకంపం
  • భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ
  • మధ్యాహ్నం గం.2.51 సమయానికి కంపించిన భూమి
నేపాల్‌లో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.

'3-10-2023 మధ్యాహ్నం 2.51 గంటలకు నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది' అని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో, హపూర్, అమ్రోహా ప్రాంతాల్లోను ప్రకంపనలు వచ్చాయని తెలిపింది.


More Telugu News