రూ.45 వేలతో రోల్స్ రాయిస్ గా మారిన మారుతి 800 కారు.. కేరళ యువకుడు చేసిన అద్భుతం..!
- సామాన్యుడి కారును లగ్జరీ కారుగా మార్చుకున్న వైనం
- నెలల తరబడి కష్టపడినట్లు చెప్పిన 18 ఏళ్ల కుర్రాడు
- యూట్యూబ్ లో వైరల్ గా మారిన వీడియో
మారుతి 800 కారు మధ్యతరగతి ప్రజల వాహనం.. అందుబాటు ధరలో ఉండడంతో ఫోర్ వీలర్ కొనుగోలు చేయాలనే కోరిక తీర్చుకోవడానికి చాలామంది దీనివైపే మొగ్గు చూపే వారు. ఇందులో టాప్ మోడల్ చూసుకున్నా రూ.6 లక్షలకు మించదు. ఇది సామాన్యుడి కార్ అయితే రోల్స్ రాయిస్ సంపన్నుల కార్.. దీని బేసిక్ మోడల్ ధర కూడా రూ.6 కోట్లకు పైనే ఉంటుంది. ఈ కారును చూడడమే తప్ప దానిని కొనుగోలు చేయాలనే ఆలోచన సామాన్య మధ్యతరగతి వారికి కలలో కూడా రాదు. అలాంటింది ఓ సాధారణ యువకుడు తమకున్న మారుతి 800 కారునే కష్టపడి రోల్స్ రాయిస్ కారులా మార్చేసుకున్నాడు. కొత్త బాడీ సెటప్ తో అచ్చంగా రోల్స్ రాయిస్ లా కనిపించేలా తీర్చిదిద్దుకున్నాడు. నెలల తరబడి కష్టపడి, రూ.45 వేల ఖర్చుతో మారుతి 800 కారును రోల్స్ రాయిస్ లా మార్చేశాడు.
కేరళకు చెందిన హదీఫ్ వయసు 18 ఏళ్లే.. కార్లంటే అందులోనూ ఖరీదైన కార్లంటే తనకు చాలా ఇష్టం. అయితే వాటిని కొనుగోలు చేసే స్తోమత హదీఫ్ కుటుంబానికి లేదు. అలాగని నిరాశపడకుండా తన ఆలోచనలకు పదునుపెట్టి సాధారణ కారునే లగ్జరీ కారుగా మార్చుకోవాలని సంకల్పించాడు. నెలల తరబడి కష్టపడుతూ వెల్డింగ్ చేస్తూ, పాత రోల్స్ రాయిస్ కార్ల విడిభాగాలు సేకరిస్తూ.. చివరికి మారుతి 800 కారును ఏకంగా రోల్స్ రాయిస్ లా మార్చేశాడు. ఇప్పుడు ఆ కారులో దర్జాగా చక్కర్లు కొడుతూ చూసేవారిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు. ఈ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేయగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.