రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా చంద్రబాబు
  • ఏ2గా ఉన్న మాజీ మంత్రి పి.నారాయణ
  • ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు వేసిన నారాయణ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు వస్తోంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఏ2గా ఉన్న మాజీ మంత్రి పి.నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు కూడా హైకోర్టులో విచారణకు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ తో కలిసి రేపు తమ ముందు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.


More Telugu News