తిరుపతి బస్‌స్టాండ్‌లో అర్ధరాత్రి రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. తల్లిదండ్రులు నిద్రిస్తుండగా ఘటన

  • శ్రీవారి దర్శనానికి  చెన్నై నుంచి వచ్చిన బాధిత కుటుంబం
  • తిరుగు ప్రయాణంలో బస్‌స్టాండ్‌ టిక్కెట్ కౌంటర్ వద్ద బాలుడితో కలిసి తల్లిదండ్రుల నిద్ర
  • తల్లిదండ్రులు గాఢనిద్రలో ఉండగా బాలుడిని అపహరించిన కిడ్నాపర్లు
  • చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తమిళనాడు చిన్నారి కిడ్నాప్‌కు గురవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్‌స్టాండ్‌లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దర్శనం అనంతరం, రెండేళ్ల వయసున్న తనయుడు సహా దంపతులు తిరుపతి బస్ స్టాండ్‌కు వచ్చాడు. అక్కడ కుటుంబమంతా ఆదమరిచి నిద్రిస్తుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో దుండగులు చిన్నారిని ఎత్తుకెళ్లిపోయారు. 

కాసేటి తరువాత తల్లిదండ్రులకు మెలకువ రాగా బిడ్డ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెన్నై నగరానికి చెందిన వారు. బాలుడిపేరు అరుల్ రామస్వామి అని పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి రామస్వామి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.


More Telugu News