చంద్రబాబు రెండుమూడు నెలలు జైలులోనే.. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

  • ప్రజలు ఎవరూ టీడీపీ దీక్షలను పట్టించుకోవడం లేదన్న సాయిప్రసాద్‌రెడ్డి
  • ఉరితాళ్లతో పోజులు కాకుండా నిజంగానే ఉరేసుకుంటే ఓ పనైపోతుందన్న ఆదోని ఎమ్మెల్యే
  • పశువులకు సీఎం, మంత్రుల ఫొటోలు కట్టి ఊరేగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జైలు నుంచి బయటకు రావడానికి రెండుమూడు నెలలు పడుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు విడుదల కావాలని టీడీపీ నాయకులు గుండు గీయించుకుంటున్నారని, పశువులకు వినతిపత్రాలు ఇస్తున్నారని తెలిపారు. మెడకు ఉరితాళ్లు బిగించుకుని పోజులివ్వడం కాకుండా నిజంగానే ఉరేసుకుంటే ఓ పనైపోతుందని వ్యాఖ్యానించారు.

టీడీపీ నేతల దీక్షలను ఎవరూ పట్టించుకోవడం లేదని, తాము కూడా పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ఆదోనిలో బూటుకాలితో తన్నే పోలీసు అధికారులు ఎవరూ లేరని, సానుభూతి కోసమే భాస్కర్‌రెడ్డి అలా చెప్పుకుంటున్నారని విమర్శించారు. పశువులకు సీఎం, మంత్రుల ఫొటోలు కట్టి అనుమతి లేకుండా ఊరేగిస్తే ప్రభుత్వం ఊరుకోబోదని హెచ్చరించారు.


More Telugu News