అమిత్ షాతో భేటీ అయిన మంద కృష్ణ మాదిగ

  • ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని కోరిన మంద కృష్ణ
  • పార్లమెంటులో బిల్లు పెట్టాలని విన్నపం
  • భాగస్వామ్య పక్షాలతో కలసి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలిశారు. సమావేశం సందర్భంగా ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఎన్నో ఎళ్లుగా తాము పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా అమిత్ షాను మంద కృష్ణ కోరారు. సుదీర్ఘకాలం పాటు తమ పోరాటం కొనసాగుతోందని... దీనికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని విన్నవించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును త్వరలోనే పార్లమెంటులో పెట్టాలని కోరారు. మంద కృష్ణ విన్నపం పట్ల అమిత్ షా సానుకూలంగా స్పందించారు. భాగస్వామ్య పక్షాలతో చర్చింది తగు నిర్ణయాన్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ నెల 7వ తేదీ నుంచి ఆలంపూర్ నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయనున్నట్టు మంద కృష్ణ ప్రకటించారు.


More Telugu News