అకస్మాత్తుగా ముంబై ప్లైటెక్కిన విరాట్ కోహ్లీ.. ఇందుకే వెళ్లాడంటున్న ఫ్యాన్స్!

  • వామప్ మ్యాచ్‌ కోసం జట్టుతోపాటు తిరువనంతపురం వెళ్లని కోహ్లీ
  • ముంబైలోని ఓ గైనకాలజీ ఆసుపత్రి వద్ద కనిపించిన విరుష్క
  • త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారంటూ వార్తలు
ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా తన రెండోవామప్ మ్యాచ్ కోసం తిరువనంతపురం చేరుకుంది. అయితే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుతోపాటు అక్కడికి వెళ్లకుండా ముంబై వెళ్లినట్టు వార్తలు రావడంతో ఏం జరిగిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కోహ్లీ భార్య అనుష్కశర్మ రెండోసారి తల్లికాబోతున్నట్టు వార్తలు రావడం.. అదే సమయంలో కోహ్లీ ముంబై వెళ్లడంతో శుభవార్త చెప్పేందుకే కోహ్లీ ముంబై వెళ్లినట్టు అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు. అంతేకాదు, దంపతులిద్దరూ ముంబైలోని ఓ గైనకాలజీ ఆసుపత్రి వద్ద కనిపించినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, కోహ్లీ-అనుష్క దంపతులకు 2021ల వామిక జన్మించింది.

ఇదిలావుంచితే, గువాహటి వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రేపు తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో రెండో వామప్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మరో మూడు రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభం అవుతుంది. 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడుతుంది.


More Telugu News