మోదీ ప్రకటన.. 9 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన పసుపు రైతు
- పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు ధరించబోనంటూ 2014లో మనోహర్‌రెడ్డి ప్రతిన
- పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న ప్రకటించిన ప్రధాని
- దశాబ్దాల కల నెరవేరడంతో సంబరాల్లో రైతులు
రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 9 సంవత్సరాల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్‌లో పుసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. బోర్డు కోసం పలుమార్లు ఉద్యమాలు కూడా జరిగాయి. గత ఎన్నికల్లోనూ పసుపుబోర్డే లక్ష్యంగా నిజమాబాద్ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. కేవలం ఈ హామీతోనే నిజమాబాద్ నుంచి బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ గెలిచారు.
నిన్న మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మోదీ పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా రైతులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పసుపు చల్లుకుంటూ ఆనందం పంచుకున్నారు.
ఈ క్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి తొమ్మిదేళ్ల తర్వాత కాళ్లకు చెప్పులు ధరించారు. పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు ధరించబోనని 2014లో ఆయన ప్రతినబూనారు. పసుపు బోర్డు కోసం రైతులతో కలిసి పాదయాత్ర చేసిన ఆయన అప్పటి నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. నిన్న ప్రధాని పసుపుబోర్డు ప్రకటించడంతో తిరిగి ఆయన చెప్పులు ధరించారు.