సముద్రంలో 36 గంటల పాటు ఒంటరిగా బాలుడు.. చిన్నారిని కాపాడిన చెక్కబల్ల!
- గుజరాత్‌లోని సూరత్ నగరంలో వెలుగు చూసిన ఘటన
- స్నేహితుడితో కలిసి బీచ్ కు వెళ్లిన బాలుడు
- అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన వైనం
- గణేశ్ విగ్రహం చెక్కబల్ల ఆసరాతో 36 గంటల పాటు సముద్రంపై తేలియాడిన బాలుడు
- బాలుడిని జాలర్లు గుర్తించి ఒడ్డుకు తరలింపు
ఆ బాలుడు సముద్రంలో గల్లంతై అప్పటికే 24 గంటలు గడిచిపోయాయి. తల్లిదండ్రులు అతడిపై ఆశలు వదులుకున్నారు. కానీ, ఇంతలో అద్భుతం జరిగింది. చెక్కబల్లపై తేలుతున్న ఆ బాలుడిని గుర్తించిన కొందరు జాలరులు అతడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఇటీవల వెలుగు చూసిందీ ఘటన.
పూర్తి వివరాల్లోకి వెళితే, సూరత్‌కు చెందిన వికాస్ (14) మూడు రోజుల క్రితం తన స్నేహితుడు లక్ష్మణ్‌తో కలిసి స్థానిక డుమాస్ బీచ్‌కు వెళ్లాడు. కొద్దిసేపు వారు ఆటలాడాక అకస్మాత్తుగా అలలు విరుచుకుపడటంతో ఇద్దరూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. స్థానికులు లక్షణ్‌ను రక్షించగా వికాస్ జాడ మాత్రం తెలియరాలేదు. అతడి కోసం ఎంత ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. బాలుడు గల్లంతై అప్పటికే దాదాపు 24 గంటలు గడిచిపోవడంతో తల్లిదండ్రుల ఆశలు కొడిగట్టడం ప్రారంభించాయి.
అయితే, చెక్కబల్లపై సముద్రంలో తేలుతున్న బాలుడిని చూసిన కొందరు జాలర్లు అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అంతకుమునుపు, నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల తాలూకు చెక్కబల్ల ఒకటి నీటిపై తేలడంతో దాని సాయంతో బాలుడు 36 గంటల పాటు సముద్రంలో మునిగిపోకుండా తనని తాను కాపాడుకున్నాడు.