టీడీపీ నేతలు కోటంరెడ్డిని చూసి నేర్చుకోవాలి: అనిల్ కుమార్
- నిన్న మోత మోగిద్దాం కార్యక్రమం చేపట్టిన టీడీపీ
- నెల్లూరు టీడీపీ నేతలపై అనిల్ కుమార్ విమర్శలు
- ఒక్కరి ముఖంలో కూడా బాధ కనిపించలేదని వ్యాఖ్యలు
- కానీ కోటంరెడ్డి ముఖంలో మాత్రం చంద్రబాబు అరెస్ట్ పట్ల బాధ కనిపించిందని వెల్లడి
టీడీపీ 'మోత మోగిద్దాం' కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా గంటలు మోగించిన నెల్లూరు టీడీపీ నేతల్లో ఏ కోశానా విచారం కనిపించలేదని, నవ్వుకుంటూ గంటలు మోగించారని ఎద్దేవా చేశారు.
కానీ, చంద్రబాబు అరెస్ట్ పట్ల నిజమైన బాధతో గంటలు మోగించింది ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమేనని అన్నారు. తనకు రెండుసార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచేందుకు కారకుడైన చంద్రబాబు అరెస్ట్ పట్ల బాధపడుతున్న ఫీలింగ్ కోటంరెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపించిందని, టీడీపీ నేతలు కోటంరెడ్డిని చూసి నేర్చుకోవాలని అనిల్ కుమార్ అన్నారు.
అటు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపైనా అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రూ.800 కోట్ల విలువైన పేదల అసైన్డ్ భూములను నారాయణ కొట్టేశాడని ఆరోపించారు. నారాయణ చేసిన అక్రమాలన్నీ బట్టబయలు అవుతాయని అన్నారు. ఇప్పుడు నారాయణకు అరెస్ట్ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. లక్షలాది విద్యార్థుల రక్తాన్ని జలగలాగా పీల్చుకుని నిలువు దోపిడీ చేసే నువ్వు సత్య హరిశ్చంద్రుడివా అంటూ నారాయణపై మండిపడ్డారు.
రాజమండ్రి జైలుకు వెళ్లిన నారాయణ... చంద్రబాబుతో ములాఖత్ కావడంపైనా అనిల్ స్పందించారు. భూములు దోచుకోవడంపై నువ్వొక మాట, నేనొక మాట చెప్పకూడదని... ఇద్దరం ఒకే మాట మీద ఉండాలని వారిద్దరూ మాట్లాడుకున్నారని అనిల్ ఆరోపించారు.