ప్రజాధనం దోచుకున్న రాజకీయనేతలను గతంలో కూడా అరెస్ట్ చేశారు: స్పీకర్ తమ్మినేని సీతారాం
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమ్మినేని సీతారాం
- చంద్రబాబు అరెస్ట్ పై ప్రశ్నించిన మీడియా
- ఓ క్రిమినల్ ను అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవలి పరిణామాలపై స్పందించారు. ఓ క్రిమినల్ ను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు అరెస్ట్ ను సమర్థించారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఎంతోమంది రాజకీయ నేతలను గతంలోనూ అరెస్ట్ చేశారని వెల్లడించారు.
ఇక, అసెంబ్లీలో టీడీపీ సభ్యులు మితిమీరి ప్రవర్తించారన్న తమ్మినేని, ఇలాంటి విపరీత చర్యలను ప్రజలు ఉపేక్షించరని స్పష్టం చేశారు. గతంలో విపక్ష సభ్యులు ఎంతో గౌరవంగా వ్యవహరించారని, ప్రభుత్వానికి నరాలు తెగిపోయేలా వారు ప్రశ్నలు అడిగేవారని వెల్లడించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పినట్టు రాజకీయాలు దిగజారిపోయాయని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు.