పండగల ముంగిట వంట గ్యాస్ పోటు.. వాణిజ్య సిలిండర్‌పై రూ. 209 పెంపు
- 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు
- తక్షణమే అమల్లోకి కొత్త రేట్లు
- డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మార్పు చేయని కంపెనీలు
నెల ఒకటో తేదీనే వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు భారీగా పెరిగింది. ఈ సిలిండర్ ధర ఏకంగా రూ. 209 మేర పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే గృహోపయోగాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించాయి.
కానీ, పండుగ సీజన్ ముంగిట వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం అందరిపై ప్రభావం పడనుంది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 1839కి చేరగా.. హైదరాబాద్‌లో ఏకంగా రూ. 1956.50కు చేరుకుంది. విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.1888.50గా ఉంది.