టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్
- నంద్యాల బొమ్మలసత్రం బొగ్గులైన్‌లో ఆక్రమణల కూల్చివేత
- అడ్డుకుని అధికారులతో బ్రహ్మానందరెడ్డి వాగ్వివాదం
- బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాకే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్
- బహ్మానందరెడ్డి అరెస్టుపై టీడీపీ నేతల ఆగ్రహం
ఆక్రమణల తొలగింపును అడ్డుకున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల బొమ్మలసత్రం బొగ్గులైన్ రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన బ్రహ్మానందరెడ్డి అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తొలగింపు ప్రక్రియను ఆపాలని, బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతలు అడ్డుకున్నారంటూ పోలీసులు బ్రహ్మానందరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బ్రహ్మానందరెడ్డి అరెస్టుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.