హైదరాబాద్‌లో పాక్ క్రికెటర్లు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి!
- వన్డే ప్రపంచకప్ కోసం హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు
- అద్భుతమైన ఆతిథ్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్రికెటర్లు
- వీడియో షేర్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు
ప్రపంచకప్ కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు ఇక్కడ ఊహించని ఆతిథ్యాన్ని అందుకుంటోంది. ఖరీదైన, అత్యద్భుతమైన ఆహారాన్ని ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. తమకు లభిస్తున్న ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగుతూ జాలీగా గడుపుతున్నారు. ఆటగాళ్ల డిన్నర్, సెల్ఫీలకు సంబంధించిన వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ఎక్స్‌లో షేర్ చేసింది. ‘హ్యాంగవుట్ ఇన్ హైదరాబాద్’ అంటూ దానికి క్యాప్షన్ తగిలించింది.
కాగా, ఉప్పల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినప్పటికీ పాకిస్థాన్ ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 345 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహమ్మద్ రిజ్వాన్ సెంచరీ (103) బాదగా, బాబర్ ఆజం 80, సౌద్ షకీల్ 75 పరుగులు చేశారు. అనంతరం 346 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ 43.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. రచిన్ రవీంద్ర 97, కేన్ విలియమ్సన్ 54, డరిల్ మిచెల్ 59, మార్క్ చాప్‌మన్ 65 పరుగులు చేశారు.