తెలంగాణాలో దసరా, బతుకమ్మ సెలవులు..మొత్తం ఎన్ని రోజులంటే
- తెలంగాణ పాఠశాలలకు దసరా, బతుకమ్మ సెలవులు
- అక్టోబర్ 13 నుంచి 25 వరకూ సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
- ఈ నెల 26న రీఓపెనింగ్
- గతేడాది కంటే ఓ రోజు తక్కువగా సెలవులు ఇచ్చిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా, బతుకమ్మ పండుగల సెలవులను ప్రకటించింది. ఈ సారి బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి మొత్తం 13 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది.
అయితే, గతేడాది దసరా సెలవులు 14 రోజుల పాటు ఇవ్వగా ఈ మారు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 25 వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఆ మరుసటి రోజు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నెల 22న పెద్ద బతుకమ్మ (దుర్గాష్టమి), 24న దసరా అన్న విషయం తెలిసిందే.