తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలోనూ కేసీఆరే.. ఫొటోను షేర్ చేసిన హిమాన్షు
- కేసీఆర్ ఆకారంలో వరిసాగు
- చుట్టూ పచ్చని పొలాల మధ్య అచ్చుగుద్దినట్టు కేసీఆర్‌లా తీర్చిదిద్దిన వైనం
- మళ్లీ కేసీఆరే అంటూ ట్యాగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు ఎక్స్‌లో షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. కొందరు తాము ఆరాధించే వ్యక్తులను ద్వీపాలలో చూస్తే, మరికొందరు ఎడారుల్లో చూస్తారని, కానీ తాను తెలంగాణలోని ప్రతి వ్యవసాయ క్షేత్రంలోనూ చూస్తానంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ తగిలించారు. దీనికి ‘కేసీఆర్ వన్స్ అగైన్’ అని ట్యాగ్ కూడా జత చేశారు.
ఇది ఓ పొలంలో వరిసాగుకు సంబంధించిన ఫొటో. చుట్టూ పచ్చని పొలాల మధ్య కేసీఆర్ ఆకారంలో వరిని సాగుచేశారు. చాలా పై నుంచి తీసిన ఈ ఫొటో అచ్చుగుద్దినట్టు కేసీఆర్‌ను తలపిస్తోంది. ఎవరో చిత్రకారుడు పొలాల్లో కుంచెతో జాగ్రత్తగా గీసిన చిత్రపటంలా ఉన్న ఈ ఫొటో ఎక్స్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై కామెంట్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఇంత తక్కువ సమయంలో రాష్ట్రాన్ని ఇంతలా అభివృద్ధి చేసిన నాయకుడు మరొకరు లేరంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారు. ఫొటోను అద్భుతంగా వర్ణించారంటూ మరికొందరు హిమాన్షును కొనియాడుతున్నారు. కాగా, హిమాన్షు షేర్ చేసిన ఫొటో ఎక్కడ తీసిందన్న వివరాలు లేవు.