చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా అక్టోబరు 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- ఇవాళ నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం
- భువనేశ్వరి గాంధీజయంతి రోజున దీక్ష చేపడతారన్న అచ్చెన్న
- అదే రోజున కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలపాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి అక్టోబరు 2న గాంధీజయంతి నాడు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. అదే రోజున (అక్టోబరు 2) రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంట్లోనూ లైట్లు ఆపేసి బయటికి వచ్చి కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను ఖండించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
నంద్యాలలో ఇవాళ టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్లోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలను తట్టుకోలేక 97 మంది చనిపోయినట్టు తెలిసిందని, వారి మరణం పట్ల ఈ సమావేశంలో సంతాపం తెలిపామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. త్వరలోనే టీడీపీ, జనసేన జేఏసీ రూపుదిద్దుకుంటుందని, ఇక పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.