నా కొడుకు ఆ తప్పు చేసి ఉండడు.. అతడే అని తేలితే కఠినంగా శిక్షించండి: ఉజ్జయిని రేప్ నిందితుడి తండ్రి
- బాధితురాలి ప్లేస్ లో తన కూతురు ఉన్నా ఇదే చెబుతానన్న రాజు సోని
- పేపర్ లో ఆ వార్త చూసి భరత్ సోనికి చెప్పానని వెల్లడి
- తనకేం సంబంధం లేనట్టు మాట్లాడాడని వివరణ
ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై దారుణ అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి భరత్ సోని అనే ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. సీన్ రీ క్రియేట్ చేస్తుండగా భరత్ సోని తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయగా.. పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ప్రస్తుతం భరత్ సోని జైలులో ఉన్నాడు. ఈ ఘటనపై భరత్ సోని తండ్రి రాజు సోని తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. బాలికపై అత్యాచారం ఘోరమని, అలాంటి నేరగాళ్లకు జీవించే హక్కు లేదని, వారికి ఉరి శిక్షే కరెక్ట్ అన్నారు.
తన కొడుకు భరత్ సోని అరెస్టు గురించి ప్రస్తావిస్తూ.. భరత్ ఈ పని చేసి ఉండడనే తాను నమ్ముతున్నట్లు రాజు సోని వివరించారు. తండ్రిగా కొడుకుకు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అయితే, కొడుకు తప్పుచేస్తే సమర్థించబోనని స్పష్టం చేశారు. భరత్ తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే ఉరి తీయాలని చెప్పారు. బాధితురాలి స్థానంలో తన కూతురు ఉన్నా కూడా ఇదే విషయం చెబుతానని వివరించాడు.
ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన వార్తను చూసి కొడుకుతో దానిపై మాట్లాడానని రాజు సోని చెప్పారు. అయితే, ఆ ఘటనతో తనకేం సంబంధంలేనట్లే భరత్ ప్రతిస్పందించాడని, అనుమానాస్పదంగా ప్రవర్తించలేదని తెలిపారు. బాలికపై ఘోరంగా అత్యాచారం జరిగిందని చెప్పగా.. ఎక్కడ జరిగిందని అడిగాడని, ఆపై రోజూలాగే ఆటో తీసుకుని వెళ్లిపోయాడని రాజు సోని చెప్పారు.