అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలి: టీసీఎస్ కీలక నిర్ణయం

  • హైబ్రిడ్ వర్క్‌కు ముగింపు పలికిన దేశీయ ఐటీ దిగ్గజం
  • వారానికి ఐదు రోజులు కార్యాలయానికి రావాలని ఆదేశం
  • సీఈవో, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ పేరిట ఈ-మెయిల్స్
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ హైబ్రిడ్ వర్క్‌కు ముగింపు పలికింది. అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులు అందరూ ఆఫీస్‌లకు రావాలని సూచించింది. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించినట్లు వార్తలు వచ్చాయి. అక్టోబర్ నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని కంపెనీ తెలిపింది.

కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత హైబ్రిడ్ విధానం ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఉద్యోగులు మూడ్రోజులు ఆఫీస్‌కు వెళ్తూ, మిగతా రెండు రోజులు ఇంటి నుంచి వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉద్యోగులు ఐదు రోజులు కార్యాలయాలకు రావాలని కంపెనీ సీఈవో, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ పేరిట ఈ-మెయిల్స్ వచ్చాయి. దీంతో అక్టోబర్ 1 నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆయా డివిజన్ల మేనేజర్లు సూచిస్తున్నారు.


More Telugu News