అవనిగడ్డలో భారీ బహిరంగ సభతో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర ప్రారంభం
- వారాహి వాహనంపై నుంచి సభికులను ఉద్దేశించి ప్రసంగించనున్న పవన్
- 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం
- 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీల స్వీకరణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర అవనిగడ్డలో బహిరంగ సభతో ప్రారంభం కానుందని ఆ పార్టీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 1న మధ్యాహ్నం మూడు గంటలకు అవనిగడ్డలోని శ్రీయక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుందని తెలిపింది. వారాహి వాహనంపై నుంచి సభికులను ఉద్ధేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రసంగిస్తారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో మూడు దశలుగా పూర్తయిన వారాహి విజయయాత్ర 4వ దశలో కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు సాగనుంది. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకొని 2, 3 తేదీల్లో పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశమవుతారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారు.