దసరా నాటికి విశాఖ వచ్చేస్తానని జగన్ చెప్పడం అక్కడి ప్రజలకు దుర్వార్త: గంటా శ్రీనివాసరావు

దసరా నాటికి విశాఖ వచ్చేస్తానని జగన్ చెప్పడం అక్కడి ప్రజలకు దుర్వార్త: గంటా శ్రీనివాసరావు
  • సీఎం జగన్ పై గంటా విమర్శలు
  • జగన్ 99 శాతం ఫెయిల్యూర్ పర్సన్ అని వెల్లడి
  • ప్రజావేదిక కూల్చి విధ్వంసానికి నాంది పలికారని వ్యాఖ్యలు
  • జగన్ విశాఖకు వస్తే పులివెందుల సంస్కృతి కూడా వస్తుందన్న టీడీపీ నేత
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడంతోనే ప్రజావేదిక కూల్చిన జగన్ విధ్వంసానికి నాంది పలికారని విమర్శించారు. ఆర్థిక నేరాలకు కారణంగా అరెస్టయిన జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని, 99 శాతం ఫెయిల్యూర్ పర్సన్ జగన్ అని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి దసరా నాటికి విశాఖ వచ్చేస్తానని అనడం అక్కడి ప్రజలకు నిజంగా దుర్వార్తేనని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ అన్ని అక్రమాలకు నిలయంగా మారిందని, ఇక జగన్ అడుగుపెడితే పులివెందుల సంస్కృతి కూడా వచ్చేస్తుందని అన్నారు.


More Telugu News