నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ప్రారంభం
- ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్
- ఏ క్షణంలోనైనా లోకేశ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం
- హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసిన లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ను సీఐడీ ఏ14గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో లోకేశ్ ను సీఐడీ అధికారులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన అన్ని పిటిషన్లపై అన్ని కోర్టుల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, నారా లోకేశ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా? లేక తిరస్కరిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.