మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చెప్పండి సారూ.. జగన్‌-అదానీ భేటీపై రామకృష్ణ డిమాండ్

  • గత రాత్రి తాడేపల్లిలో సీఎం నివాసంలో జగన్-అదానీ భేటీ
  • ఈ భేటీ వ్యక్తిగతమా? వ్యవస్థీకృతమా? చెప్పాలని రామకృష్ణ డిమాండ్
  • ఇప్పటికే గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అదానీకి కట్టబెట్టారని ఆగ్రహం
తాడేపల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి-గౌతం అదానీ మధ్య జరిగిన భేటీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇది వ్యక్తిగత భేటీనా? లేకుండా వ్యవస్థీకృత భేటీనా? అని ప్రశ్నించారు. ఆహ్వాన పత్రిక ఇచ్చే పేరుతో గతంలో ఒకసారి జగన్‌తో అదానీ నాలుగు గంటలకుపైగా భేటీ అయ్యారని గుర్తు చేశారు. 

గంగవరం, కృష్ణపట్నం పోర్టులను, సోలార్ విద్యుత్ ఒప్పందాలను ఇప్పటికే అదానీకి కట్టబెట్టారని, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును కూడా భారీ ధరకు అదానీకే జగన్ కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు మరోమారు వీరిద్దరూ భేటీ అయ్యారని, కాబ్టటి ఈ రహస్య భేటీ వెనక ఉన్న మర్మం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, జగన్-అదానీ భేటీ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఇంతవరకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రామకృష్ణ ఈ డిమాండ్ చేశారు.


More Telugu News