చివరి నిమిషంలో టీమిండియాలో మార్పు... వరల్డ్ కప్ జట్టులో అశ్విన్ కు చోటు
- వరల్డ్ కప్ లో ఆడే టీమిండియా నుంచి అక్షర్ పటేల్ అవుట్
- ఇటీవల ఆసియాకప్ సందర్భంగా గాయపడిన అక్షర్
- నిర్ణీత సమయంలోగా కోలుకోలేకపోయిన యువ ఆల్ రౌండర్
- చివరి నిమిషంలో జట్టులో మార్పు చేసిన టీమిండియా మేనేజ్ మెంట్
టీమిండియా యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయంతో వరల్డ్ కప్ జట్టు నుంచి వైదొలిగాడు. అక్షర్ పటేల్ ఇటీవల ఆసియా కప్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. అక్షర్ ఆసియా కప్ ఫైనల్ కు కూడా గాయంతో దూరమయ్యాడు.
వరల్డ్ కప్ నాటికి కోలుకుంటాడని భావించినా, ఆ సూచనలు కనిపించకపోవడంతో చివరి నిమిషంలో టీమిండియాలో మార్పు చేశారు. వరల్డ్ కప్ లో ఆడే టీమిండియా నుంచి అక్షర్ పటేల్ ను తప్పించి, అతడి స్థానంలో సీనియర్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కు స్థానం కల్పించారు.
ఇటీవల ఆసీస్ తో వన్డే సిరీస్ లో అశ్విన్ అంచనాలకు అనుగుణంగా రాణించడం తెలిసిందే. కాగా, వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేడని బీసీసీఐ, సెలెక్టర్లపై విమర్శలు వచ్చాయి. జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.. వీళ్లందరూ ఎడమచేతివాటం స్పిన్నర్లే. ఇప్పుడు అశ్విన్ రూపంలో ఓ కుడిచేతివాటం స్పిన్నర్ కు కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు లభించినట్టయింది.